: హెల్మెట్ పెట్టుకుంటానని ప్రామిస్ చేయండి: హైదరాబాద్ రోడ్డుపై వాహనదారులకు సచిన్ విజ్ఞప్తి


 భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తాను హైదరాబాద్‌లో రోడ్డుపై కారులో వెళుతున్న‌ప్పుడు ప‌లువురు యువ‌కుల‌కు చేసిన సూచ‌న‌ల గురించి చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. రోడ్డుపై  కారులో ఉన్న స‌చిన్‌ను గ‌మ‌నించిన కొంద‌రు ఆయ‌నతో సెల్ఫీ దిగడానికి ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో స‌చిన్.. హెల్మెట్ ధ‌రించాల‌ని వారికి సూచించాడు. హెల్మెట్ పెట్టుకుంటాన‌ని ప్రామిస్ చేయండ‌ని అన్నాడు. కారులో స‌చిన్‌ను గ‌మ‌నించిన వాహ‌న‌దారులు ఆయ‌న‌కు హాయ్  చెబుతోంటే.. స‌చిన్ మాత్రం హెల్మెట్ పెట్టుకోవాల‌ని వారికి సూచిస్తూ ముందుకు క‌దిలాడు.


  • Loading...

More Telugu News