: శ్రీనగర్‌ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో రెచ్చిపోయిన ఆందోళనకారులు.. కాల్పుల్లో ఇద్దరి మృతి


దేశంలో ప‌ది అసెంబ్లీ స్థానాల‌తో పాటు శ్రీనగర్‌ లోక్‌సభ స్థానానికి ఈ రోజు ఎన్నిక‌లు జరుగుతున్నాయి. అయితే, శ్రీ‌న‌గ‌ర్‌లో తీవ్ర‌ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళ‌న‌కారులు రాళ్లు విసురుతూ రెచ్చిపోయారు. దీంతో పోలీసులు కాల్పులు జ‌ర‌ప‌డంతో ఇద్ద‌రు అక్క‌డిక్క‌డే మృతి చెందారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలోని పలు చోట్ల భారీగా బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ బుద్గాం, గండేర్‌బల్‌ల‌లో ఆందోళనకర ప‌రిస్థితులు త‌లెత్తాయి. కాల్పుల్లో మృతి చెందిన వ్య‌క్తుల‌ను మహ్మద్ అబ్బాస్, ఫైజాన్ అహ్మద్ రాథోడ్‌లుగా గుర్తించారు.  

మ‌రోవైపు మధ్యప్రదేశ్ లోని బంధవ్ గఢ్ నియోజవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లోనూ ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకున్నాయి. భింద్ ప్రాంతంలో కాంగ్రెస్ నేత కారుపై ఇద్దరు ఆందోళనకారులు దాడికి దిగి, వాహన అద్దాలు ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదు. 

  • Loading...

More Telugu News