: అమ్మ ప్రేమ: దూడను బైక్‌పై తీసుకెళ్లిన యువకులు.. బైక్ వెనకాలే పరుగెత్తిన తల్లి ఆవు!
తల్లి ప్రేమను మించింది ఏదీ లేదని అంటుంటారు. ఇది పశువులకు కూడా వర్తిస్తుంది. అప్పుడే పుట్టిన ఓ దూడను ఇద్దరు వ్యక్తులు బైక్ పై వేరే ప్రాంతానికి తరలిస్తుండగా ఆ విషయాన్ని గమనించిన తల్లి ఆవు ఆ బైకు వెనకాలే పరుగులు తీసిన ఘటన కాకినాడలో చోటుచేసుకుంది. తన బిడ్డ కోసం ఆరాటపడుతూ రోడ్డుపై బైకు వెనకాలే పరుగులు తీస్తూ వెళ్లింది. ఆవు తమ వాహనం వెనకాలే వస్తుండడాన్ని గమనించిన ఆ యువకులు బైక్‌ను ఆపారు. దీంతో తల్లి ఆవు తన బిడ్డను ప్రేమతో నాకి ముద్దులాడుకుంది. స్థానికులను ఈ దృశ్యం కదిలించింది.