: బాలకృష్ణపై చంద్రబాబు ప్రశంసల జల్లు
సినీనటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లుకురిపించారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాలు నిన్న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... నిరుపేదల కోసం బాలకృష్ణ నిత్యం పనిచేస్తున్నారని అన్నారు. ఈ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని చెప్పారు. పేదల కోసం పనిచేస్తోన్న ఒకే ఒక సంస్థ బసవతారకమని ఆయన కొనియాడారు.