: అమెరికాపై ఉత్తర కొరియా మండిపాటు.. తగిన విధంగా బదులిస్తామ‌ని హెచ్చరిక


సిరియాలో ఇటీవ‌ల జ‌రిగిన ర‌సాయ‌న దాడికి ప్రతిగా షైరత్ వైమానిక స్థావరంపై అమెరికా క్షిపణులతో దాడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే, అమెరికా చ‌ర్య‌ను ఉత్త‌ర‌కొరియా కూడా త‌ప్పుబ‌ట్టింది. ఒక సార్వభౌమాధికార దేశంపై చేసిన ఈ దాడి ఏమాత్రం సమ్మతించదగినది కాదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆ చ‌ర్య‌ క్షమించరానిదని, ఈ దాడి త‌మ‌కు చేసిన హెచ్చరికగా భావిస్తున్నామ‌ని ఉత్త‌ర కొరియా పేర్కొంది. ఇలాంటి దాడులు త‌మ దేశంపై కూడా ఏ క్షణమైనా జరగవ‌చ్చని అమెరికా పరోక్షంగా తెలిపిందని వ్యాఖ్యానించింది. అందుకే తాము త‌మ‌ సైనిక సంపత్తిని పెంచుకోవడంపై మరింత వేగాన్ని పెంచుతామ‌ని హెచ్చ‌రించింది. త‌మ‌కు తగిన సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బదులిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

  • Loading...

More Telugu News