: ఉత్తరకొరియా ద్వీపం సమీపంలోకి దూసుకెళ్లిన అమెరికా నావికాదళ బృందం
ఉత్తరకొరియా తమ దుందుడుకు చర్యలను ఆపకుండా ముందుకు వెళుతుండడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఉత్తరకొరియా తమ చర్యలను కొనసాగిస్తూ జపాన్ జలాల్లోకి క్షిపణులను ప్రయోగించి సమస్యను మరింత పెంచేలా ప్రవర్తించింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉత్తర కొరియాతో వివాదాన్ని తాము ఒంటరిగానే తేల్చుకోగలమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన నావికాదళ బృందం ఉత్తరకొరియా ద్వీపం సమీపంలోకి దూసుకెళ్లింది. ఇందులో దికార్ల్ విన్సాన్ స్ట్రైక్ గ్రూప్‌గా పిలిచే బృందం యుద్దనౌకలతో పాటు విమాన వాహకనౌకలు ఉన్నాయి. దీంతో ఆ పరిసరాల్లో ఉత్కంఠ నెలకొంది.