: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి, అన్నంత పనీ చేసింది!
ఓ యువకుడిని ఎంతగానో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి సంవత్సరం తిరగకుండానే ఆత్మహత్య చేసుకున్న ఘటన పుంగనూరు పట్టణంలోని రాగానిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు తెలిపారు. బెంగళూరుకు చెందిన తేజశ్వని (20 ) అనే యువతి తిరుపతిలో ఉన్న తన బంధువుల ఇంటికి పదే పదే వెళ్లేదని, ఈ క్రమంలో పుంగనూరుకు చెందిన యువకుడు ప్రశాంత్‌పాల్‌తో ప్రేమలో పడిందని చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది పెళ్లి చేసుకొని పుంగనూరులో ఉంటున్నారని, అయితే, పెళ్లయిన కొన్ని నెలల నుంచే వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చాయని చెప్పారు.
రెండు రోజుల క్రితం తన భర్త ప్రశాంత్‌పాల్‌కు ఫోన్ చేసిన తేజశ్విని తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిందని పోలీసులు అన్నారు. వెంటనే ప్రశాంత్ పాల్ తన ఇంటికి చేరుకునేలోపే ఆమె పురుగుల మందు తాగేసిందని, ఆమెను పుంగనూరు ఆస్పత్రికి తరలించేలోపే మరణించిందని చెప్పారు.