: దినకరన్‌ పెద్ద మోసగాడు: జయలలిత మేనల్లుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు


జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ఉప ఎన్నిక‌ల్లో శ‌శిక‌ళ వ‌ర్గం త‌ర‌ఫునుంచి దినకరన్ పోటీకి దిగిన విష‌యం తెలిసిందే. అయితే, ఆయ‌న పెద్ద మోస‌గాడ‌ని జయలలిత మేనల్లుడు దీపక్‌ జయకుమార్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. అంతేగాక‌, పార్టీతో పాటు ప్రభుత్వాన్ని నడిపించే అధికారం శశికళ వర్గానికి లేదని ఆయ‌న అన్నారు. జయల‌లిత‌కు నిజమైన రాజకీయ వారసులు పన్నీర్‌ సెల్వం, మధుసూదనన్‌ మాత్రమేనని ఆయ‌న వ్యాఖ్యానించారు. జయల‌లిత ఫొటోతో ఎన్నిక‌ల్లో ప్రచారం చేసుకునే అర్హత దినకరన్‌కు లేదని, అధికార పీఠం ఎక్కాల‌నుకుంటున్న దినకరన్ ఆశ‌లు నెర‌వేర‌బోవ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News