: లైవ్‌ షో కొనసాగుతుండగా ఒక్కసారిగా పిల్లి ప్రత్యక్షమైంది!


లైవ్ షో నిర్వహిస్తోన్న స‌మ‌యంలో ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. లాత్వియా రాజధాని రిగాకు మేయర్‌గా పనిచేస్తున్న నిల్స్‌ ఉసాకోవ్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా లైవ్‌ షోలో ఉన్నారు. ఆయ‌న ముందు ఉన్న టేబుల్‌పై ఓ గ్లాస్‌లో మంచి నీరు ఉంది. అయితే, అదే స‌మ‌యంలో ఓ నల్లటి పిల్లి  వచ్చి ఆ గ్లాస్‌లోని నీటిని తాగింది. ఆన్‌లైన్ లైవ్ షోలో ఆయ‌న‌ పలు ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఈ స‌మ‌యంలోనే ఒక్క‌సారిగా పిల్లి ద‌ర్శ‌మిచ్చింది. దీంతో ఆయ‌న కాసేపు ఆ పిల్లిని చూసి నవ్వుతూ దానిని అక్క‌డి నుంచి పంపించారు. మళ్లీ త‌న ప‌నిని కొన‌సాగించారు.

  • Loading...

More Telugu News