: ఫోటోగ్రాఫర్ పై దాడి.. బాలీవుడ్ నటుడిపై కేసు నమోదు!


ఓ ఫొటోగ్రాఫ‌ర్‌పై దాడి చేయ‌డంతో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ పై కేసు నమోదైంది. మొదట మోడల్ గా రాణించి బాలీవుడ్‌లో హీరోగా మారిన రాంపాల్ అనంత‌రం నిర్మాతగానూ కొన్ని సినిమాలను రూపొందించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్పుడు టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. అయితే, ఇటీవ‌ల ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఓ కార్య‌క్రమంలో ఓ ఫొటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చాడు. ఆయ‌న‌ వద్దని ఎంత చెబుతున్నా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీశాడు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన రాంపాల్ మొదట ఫొటోగ్రాఫర్ చేతిలోని కెమెరాను తీసుకుని విసిరికొట్టాడు. దీంతో దాడి చేసి, గాయపరిచాడని బాధిత ఫొటోగ్రాఫర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో రాంపాల్‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

  • Loading...

More Telugu News