: విషాదాన్ని దిగమింగి క్రీజులోకి దిగి ఆకట్టుకున్న రిషభ్ పంత్!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆటగాడు రిషభ్ పంత్ అందరినీ ఆకట్టుకున్నాడు. విషాదాన్ని అధిగమించి ఇన్నింగ్స్‌ను నడిపి అందరి మనసుల్ని గెలుచుకున్నాడు. బుధవారం రాత్రి రిషభ్ తండ్రి హఠాన్మరణం చెందారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన రిషభ్ గురువారం దహన సంస్కారాలు చేసి వస్తుండగా జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అయితే శనివారం జరిగిన మ్యాచ్‌లో దుఃఖాన్ని దిగమింగి బ్యాటింగ్‌కు దిగిన పంత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రిషభ్ కడదాకా చేసిన పోరాటం జట్టుకు విజయాన్ని అందివ్వకపోయినా ప్రేక్షకుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు.