: పెంపుడు కుక్కతో సచివాలయానికి తెలంగాణ సీఎస్.. ఫొటోలు తీస్తుంటే మండిపాటు!
తెలంగాణ సీఎస్ ఎస్పీసింగ్ శనివారం ఉదయం తన పెంపుడు శునకంతో కార్యాలయానికి చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఉదయం 11.40 గంటలకు కారులో కార్యాలయానికి చేరుకున్న సీఎస్ తన పెంపుడు కుక్కను తీసుకుని తన చాంబర్ కి వెళ్తుండగా విలేకరుల కన్ను పడింది. నిజానికి రెండో శనివారం కావడంతో సచివాలయానికి సెలవు. అయితే ఏదో ముఖ్యమైన పని మీద సీఎస్ వచ్చి ఉంటారని అందరూ భావించారు. కానీ కుక్కతో కారులోంచి దిగిన ఆయనను చూసి ఆశ్చర్యపోయిన విలేకరులు ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా, సీఎస్ ఒక్కసారిగా మండిపడ్డారు. ఫొటోలు తీయవద్దంటూ కోపంతో ఊగిపోయారు.