: మలాలాకు మరో గౌరవం.. ఐరాస శాంతిదూతగా ఎంపిక


పాకిస్థాన్‌కు చెందిన హక్కుల కార్యకర్త, నోబెల్ విజేత మలాలా యూసఫ్‌జాయ్‌ (19)కు మరో అరుదైన, అత్యున్నత గౌరవం లభించింది. ఆమెను ఐక్యరాజ్య సమితి శాంతిదూతగా ఎంపిక చేసినట్టు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. పిన్న వయసులోనే అత్యంత అరుదైన గౌరవాన్ని అందుకున్న మలాలా వచ్చేవారం ఐరాస ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా గుటెరస్ మాట్లాడుతూ బాలికల విద్యా హక్కుల కోసం మలాలా ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఎందరికో స్ఫూర్తినిచ్చాయన్నారు. బాలికల విద్య కోసం ఉగ్రవాదులను సైతం ఎదిరించారని గుటెరస్ కొనియాడారు.

  • Loading...

More Telugu News