: సౌదీ అరేబియాపై ఉగ్రదాడి.. తెలుగు వ్యక్తి మృతి... మరో ఇద్దరు తెలుగు వారికి గాయాలు!
సిరియాలో ఐఎస్ఐఎస్ కు మద్దతుగా అమెరికా చేసిన ఉగ్రదాడికి ప్రతిగా యెమన్ లో ఇరాన్ మద్దతుదారులైన హుతి ఉగ్రవాదమూకలు పొరుగున ఉన్న సౌదీ అరేబియా సరిహద్దు నగరమైన నజ్రాన్ పై క్షిపణి దాడి చేశాయి. ఈ దాడిలో ఒక ప్రవాసీ తెలుగు కార్మికుడు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు తెలుగు వారు చికిత్స పొందుతున్నారు. నజ్రాన్ అనే పట్టణంపై హుతి ఉగ్రవాదులు చేసిన దాడిలో టైరు పంక్చర్ దుకాణంలో పని చేస్తున్న సమయంలో వారికి దగ్గరగా ఈ క్షిపణి పేలింది. దీంతో కడప జిల్లా అట్లూరు మండలం కమలుకూరు గ్రామానికి చెందిన అర్వ వెంకట సుబ్బారెడ్డి (28) మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఓబులేష్ రెడ్డి, జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన రావు, ఉత్తరప్రదేశ్ కు చెందిన సంతోష్ లు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.