: బజారులో రికార్డింగు డాన్సులు వేసుకునే దానివి!: రోజాపై మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు


వైఎస్సార్సీపీ నేత రోజాలా పచ్చిగా మాట్లాడడం తమకు కూడా వచ్చని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. రోజా వ్యాఖ్యలపై మండిపడ్డ ఆయన మాట్లాడుతూ, 'బజారులో రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బతికే నువ్వు... ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మకాలి శాసనసభలో అడుగుపెట్టావు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా సరిగ్గా బుద్ధి తెచ్చుకుని సరిగ్గా వ్యవహరించడం నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఆమె గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగోదని ఆయన చెప్పారు.

కాగా, అంతకు ముందు ఆమె పశ్చిమగోదావరి జిల్లాలో మాట్లాడుతూ, మీ ఇంట్లో వ్యక్తులు మరణిస్తే ఒప్పుకుంటారా? పరిశ్రమలు అనువైన ప్రాంతాలకు తరలించాలని తెలియదా? అంటూ నిప్పులు చెరిగారు. మీరు కడుపుకి అన్నం తింటున్నారా? లేక గడ్డి తింటున్నారా? అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News