: కేంద్రాన్ని కోర్టుకు లాగిన తొమ్మిదేళ్ల బాలిక


కేంద్ర ప్రభుత్వాన్ని తొమ్మిదేళ్ల బాలిక కోర్టుకు లాగిన ఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఉత్తరాఖండ్ కు చెందిన రిధిమా పాండే (9) అనే బాలిక గ్రీన్ ట్రైబ్యునల్ లో ఫిర్యాదు చేసింది. పర్యావరణ పరిరక్షణ కోసం కార్బన్ బడ్జెట్ ను రూపొందించి, పర్యావరణ పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధంచేసేలా ఆదేశించాలని రిధిమా పిటిషన్ లో డిమాండ్ చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన గ్రీన్ ట్రైబ్యునల్ ఆమె పిటిషన్ కు రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది. 

  • Loading...

More Telugu News