: జై పుట్టిన రోజున స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిన అంజలి


కోలీవుడ్ లో నటించి గుర్తింపు తెచ్చుకుని, టాలీవుడ్ లో నిలదొక్కుకున్న అంజలితో తమిళ నటుడు జై అనుబంధంపై తమిళ సినీ పరిశ్రమలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దానిని నిజం చేస్తూ ఆ మధ్య జై తమిళ స్టార్ సూర్య పిలుపుతో 'దోశ ఛాలెంజ్'ను స్వీకరించి, దోశ వేసి అంజలితో తినిపించిన సంగతి తెలిసిందే.

అనంతరం జై పుట్టిన రోజు సందర్భంగా అంజలి అతనికి స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చిందట. 'బెలూన్' సినిమా షూటింగ్ లో ఉన్న జై దగ్గరకు అంజలి కేక్ తో వెళ్లింది. యూనిట్ మధ్య జైతో కేక్ కట్ చేయించి, తినిపించిందట. ఆ రోజంతా వారిద్దరూ కలిసే ఉన్నారని, అచ్చం భార్యాభర్తల్లాగే ఉన్నారని 'బెలూన్' సినిమా యూనిట్ చెబుతోంది. వారి వివాహానికి ఇరువైపుల కుటుంబాలు అంగీకరించాయని కోలీవుడ్ లో వార్తలు హల్ చల్ చేస్తుండగా, తామిద్దరం మంచి స్నేహితులమని వారిద్దరూ చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News