: ఆర్యతో అయితే ఫ్రీగా నటిస్తానంటున్న వర్థమాన నటి!
సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలో నిలదొక్కుకునేందుకు సినీ నటులు ఒక్కొక్కరు ఒక్కోరకంగా వ్యవహరిస్తుంటారు. ఇక మలయాళ భామ ఐశ్వర్య మీనన్ విషయానికి వస్తే, ఇప్పుడిప్పుడే కోలీవుడ్ లో నిలదొక్కుకుంటున్న ఈ చిన్నది ప్రస్తుతం వీర సినిమాలో కృష్ణ సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో నటుడు ఆర్య సరసన నటించేందుకు ప్రయత్నాలు మొదలెట్టిందట. అన్డుయ్లో భాగంగా ఆర్య సరసన అయితే ఫ్రీగా అయినా నటించేందుకు సిద్ధమని చెబుతోందట. ప్రస్తుతం ఆర్యతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్న దర్శకులతో ఐశ్వర్య మీనన్ రాయబారం నడుపుతోందని చెన్నై టాక్. ఆర్యతో నటించిన అనంతరం హీరోయిన్లు స్టార్ హోదాను అందుకుంటారని కోలీవుడ్ లో ఒక నమ్మకం ఉన్న సంగతి తెలిసిందే. అందుకే, అమ్మడు ఆ ప్లాన్ వేసిందన్న మాట!