: విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన...కుటుంబ సభ్యుల బడితె పూజ
హైదరాబాదులోని కీచక టీచర్ కు విద్యార్థిని తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉప్పల్, భరత్ నగర్ లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక బాలిక ఆరో తరగతి చదువుతోంది. నవీన్ అనే ఉపాధ్యాయుడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన బాలిక అతని తీరుపై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు వచ్చి అతనికి బడితె పూజ చేశారు. అంతే కాకుండా కీచకుడైన టీచర్ ను పెట్టుకున్న స్కూలు అనుమతులు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.