: సేమ్ సీన్...ఐపీఎల్ లో కొత్త సెంటిమెంట్!
ప్రతీ చోటా ఉన్నట్టే, క్రికెట్ లో కూడా ఎన్నో నమ్మకాలు (సెంటిమెంట్స్) ఉంటాయి. అభిమానులతోపాటు ఆటగాళ్లు కూడా ఈ నమ్మకాలను ఫాలో అవుతుంటారు. ఐపీఎల్ సీజన్ 10లో చిత్రమైన నమ్మకం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. ఈ సీజన్ లో తొలుత ఫీల్డింగ్ చేసిన జట్టు విజయం సాధిస్తుండగా, తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు పరాజయం పాలవుతోంది. ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో ఇదే జరిగింది. దీంతో ప్రతి మ్యాచ్ లో టాస్ గెలిచిన్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంటున్నాడు. నాలుగో మ్యాచ్ లో పూణే సూపర్ జెయింట్స్ తో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు తలపడనుంది. ఇండోర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన మ్యాక్స్ వెల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కాగా, పంజాబ్ జట్టు ఇంతవరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ఇప్పటి వరకు ఈ జట్టుకు పది మంది కెప్టెన్లు మారారు కానీ జట్టు జాతకం మాత్రం మారలేదు. ఈ సీజన్ తో అయినా తమ జట్టు ఫేట్ మారుతుందని ప్రీతి జింటా భావిస్తోంది. అయితే ఈ జట్టుపై ధోనీకి మంచి రికార్డు ఉంది.