: ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటిదాన్నంటున్న ఐటెం గర్ల్ రాఖీ సావంత్


తాను ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటిదాన్నని బాలీవుడ్ ఐటెమ్ గర్ల్ రాఖీ సావంత్ చెప్పుకొచ్చింది. వాల్మీకిపై వివాదాస్పద కామెంట్ల గురించి  ఆమె మాట్లాడుతూ, వివాదాలపై పోరాటం తనకు కొత్త కాదని, తాను సమస్యలు ఎదుర్కోవడం ఇదే తొలిసారి కాదని తెలిపింది. తన కెరీర్ ను నాశనం చేసేందుకు కొంత మంది తనను వివాదాల్లోకి లాగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వాల్మీకి మహర్షిలా సింగర్ మికా సింగ్ కూడా మారిన మనిషని ఓ రియాలిటీ షోలో పాల్గొన్న సందర్భంగా రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు ఆమె అరెస్టుకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కనీసం మీకా సింగ్ కూడా తనకు మద్దతు తెలపలేదని రాఖీ సావంత్ వాపోయింది. బాలీవుడ్ నటులు మాత్రం తనకు మద్దతుగా మెసేజ్ లు పెట్టారని రాఖీ సావంత్ చెప్పింది. 

  • Loading...

More Telugu News