: నెల్లూరు జిల్లా జడ్పీ సమావేశం రసాభాస...టీడీపీ ఎమ్మెల్సీ ఆగ్రహం


నెల్లూరు జిల్లా జడ్పీ సమావేశం రసాభాసగా మారింది. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశం సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతుండగా, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డి మైక్ కట్ చేశారు. దీంతో ఎమ్మెల్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడుతుండగా మైక్ ఎందుకు కట్ చేశారంటూ వాకాటి ఆగ్రహంతో ఊగిపోయారు. జడ్పీ ఛైర్మన్ సభామర్యాదలు పాటించాలంటూ ఆయన చిందులు తొక్కారు. తీవ్ర ఆగ్రహంతో మైక్ ను కిందికి విసిరేశారు. ఈ సమయంలో జిల్లాపరిషత్ సమావేశం వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాలుగా విడిపోయి అరుపులు కేకలతో నిండిపోయింది. దీంతో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవ తీసుకుని వీరితో మాట్లాడడంతో వివాదం సద్దుమణిగింది. 

  • Loading...

More Telugu News