: యుద్ధ విమానాన్ని స్వీకరించిన చంద్రబాబు.. మ్యూజియంగా మారుస్తామని ప్రకటన!
టీయూ-142 యుద్ధ విమానాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా స్వీకరించారు. విశాఖపట్నంలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో విమానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో తమ హయాంలోనే కురుసుర సబ్ మెరైన్ ను తీసుకొచ్చామని గుర్తు చేశారు. బీచ్ రోడ్డులో సబ్ మెరైన్ ఎదుట ఈ యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ విమానాన్ని ఓ మ్యూజియంగా మారుస్తామని తెలిపారు. పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు టీయూ-142 దోహదపడుతుందని చెప్పారు. వెంచర్ టూరిజంలో నేవీతో కలసి పని చేస్తామని చెప్పారు. వాటర్ స్పోర్ట్స్ లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలుపుతామని తెలిపారు. విమాన స్వీకరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావులు కూడా హాజరయ్యారు.