: మూడు రోజుల పాటు మండే సూర్యుడే... జాగ్రత్తలు తెసుకోండి!
సూర్యుడు మరింతగా మండిపోనున్నాడు. రేపటి నుంచి మూడు నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే, మరింత అధిక వేడిమి నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలోని కోల్ బెల్ట్ ఏరియాలో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావచ్చని, వడగాల్పులు వీస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావాలంటే, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఎల్ నినో ప్రభావంతో, ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో ఎండలు పెరుగుతున్నట్టు వెల్లడించారు.