: ఇష్టం లేని పెళ్లి చేశారని భర్తకు టోకరా ఇచ్చి మరో రైలు ఎక్కేసిన అమ్మాయి!


తనకు ఇష్టం లేకుండా వివాహం చేశారన్న కోపంతో ఓ ముస్లిం మైనర్ బాలిక, కాపురానికి వెళుతున్న సమయంలో భర్తకు టోకరా ఇచ్చి తాను ప్రయాణిస్తున్న రైలు దిగి మరో రైలు ఎక్కింది. ఈ ఘటన జార్ఖండ్ లోని కుమార్ ధూబి ప్రాంతంలో జరిగింది. 16 సంవత్సరాల అమ్మాయికి, గుజరాత్ కు చెందిన వ్యక్తితో ఇష్టం లేని పెళ్లి జరిపించారు తల్లిదండ్రులు. ఆమె కాపురానికి వెళ్లేందుకు నిరాకరిస్తే, నచ్చజెప్పి పంపారు. ఇక రైల్లో ఆమెను గుజరాత్ కు తీసుకు వెళుతుండగా, ధన్ బాద్ స్టేషనులో భర్తను ఏమార్చిన బాలిక, పక్కనే ఉన్న మరో రైలు ఎక్కి రాయపూర్ చేరుకుంది.

ఆమెను చైల్డ్ వెల్ ఫేర్ కమిటీ అధికారులు గుర్తించి, తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు. తనతో వివాహం జరిగిన వ్యక్తికి గతంలోనే వివాహమైందని, పిల్లలు కూడా ఉన్నారని, తాను ఆ నరకంలోకి వెళ్లబోనని, చదువుకోవాలని ఉందని ఆ బాలిక వాపోయింది. మైనర్ బాలికకు వివాహం జరిపించడం చట్టవిరుద్ధమని, బలవంతంగా భర్తకు అప్పగించాలని మరోసారి ప్రయత్నిస్తే, కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు. ఆమె జోలికి వెళ్లకూడదని కచ్ ప్రాంత నివాసి షక్కర్ ఖాన్ కు సమన్లు పంపారు.

  • Loading...

More Telugu News