: ఈ ఏడాదికి హెచ్-1బీ కోటా ముగిసిపోయింది
విదేశీ ఉద్యోగులకు అమెరికా మంజూరు చేసే హెచ్-1బీ వీసాల మాండేటరీ (తప్పనిసరి) కోటా ముగిసింది. 2018 ఆర్థిక సంవత్సరానికి గాను వీసా అప్లికేషన్ ప్రాసెస్ ముగిసిందని అమెరికా ఫెడరల్ ఏజన్సీ ప్రకటించింది. 65 వేల మాండేటరీ వీసా కోటా పూర్తయిందని తెలిపింది. అమెరికాలోని కంపెనీల్లో పనిచేసే నిపుణుల కోసం ఈ వీసాలను మంజూరు చేస్తారు. 65 వేలకు మించకుండా ఈ వీసాలను అమెరికా జారీ చేస్తుంది.