: నారా లోకేష్ ను కలిసిన చింతమనేని!
మంత్రి పదవి రాకపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలకపాన్పు ఎక్కిన సంగతి తెలిసిందే. అవసరమైతే సొంత పార్టీ స్థాపిస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రోజుల వ్యవధిలోనే ఆయన మెత్తబడిపోయారు. మంత్రి నారా లోకేష్ ను ఆయన కలిశారు. మంత్రి పదవిని చేపట్టిన లోకేష్ కు పుష్పగుచ్ఛం ఇచ్చి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలను స్మార్ట్ విలేజ్ లుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించాలను ఆయన లోకేష్ ను కోరారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేయడమే కాకుండా, పల్లె సీమలను ప్రగతి పథంలో నడిపే అవకాశం మంత్రిగా లోకేష్ కు వచ్చినందుకు ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.