: మనుషులే కాదు.. కుక్కలు కూడా రక్తదానం చేశాయి!


ప్రాణాపాయంలో ఉన్నవారి ప్రాణాలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో అనేక మంది రక్తదానం చేస్తుండటం తెలిసిందే. అయితే, కుక్కలు కూడా రక్తదానం చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే, అపాయంలో ఉన్న కుక్కలకు రక్తాన్ని అందించే ఉద్దేశంతో కుక్కల బ్లడ్ బ్యాంక్ ను ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ బ్లడ్ బ్యాంకులో కుక్కల రక్తాన్ని నిల్వ చేసి, అవసరమైన కుక్కలకు ఎక్కిస్తారు. ఈ నేపథ్యంలో, ఆరోగ్యంగా ఉన్న కుక్కల నుంచి రక్తాన్ని సేకరించేందుకు కుక్కల రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కుక్కల యజమానులు చాలా మంది తమ కుక్కలను రక్తదాన శిబిరానికి తీసుకొచ్చి, రక్తదానం చేయించారు. కుక్కలకు పరీక్షలు నిర్వహించిన అనంతరం, వాటి నుంచి రక్తాన్ని సేకరించారు. ఈ క్రమంలో, రక్తదానం చేసిన కుక్కలతో పాటు, వాటి యజమానులను నిర్వాహకులు సన్మానించారు.

  • Loading...

More Telugu News