: కోటి ఉమెన్స్ కాలేజీ వద్ద యువతి కిడ్నాప్ కలకలం!


పగలు, రాత్రి తేడా లేకుండా బిజీగా ఉండే హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీ వద్ద ఓ యువతిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించడం కలకలం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, గత రాత్రి హాస్టల్ కు వెళుతున్న ఓ యువతిని రోడ్డుపై అటకాయించిన కొందరు పోకిరీలు వేధింపులకు దిగారు. ఆపై కిడ్నాప్ కు విఫలయత్నం చేశారు. భయపడిన ఆ యువతి అప్రమత్తమై కేకలు పెట్టడంతో, మిగతా విద్యార్థినులు స్పందించారు. కిడ్నాప్ కు ప్రయత్నించిన ఓ నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, మిగతా నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో వీధిలైట్లు లేకపోవడంతోనే, వీరు సులువుగా అక్కడ మకాం వేశారని విద్యార్థినులు వాపోయారు. వెంటనే స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News