: రాత్రి పూట మీ హీరో నిద్రపోతే, నన్నెందుకు అంటున్నారు?: కాంగ్రెస్ కు నితిన్ గడ్కరీ పంచ్!


గోవాలో అతిపెద్ద పార్టీగా ఉండి కూడా అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ, ఈ వైఫల్యానికి దిగ్విజయ్ సింగ్ కారణమని నిందిస్తున్న వేళ, కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సైతం ఈ వివాదంలోకి దిగారు. లోక్ సభలో సమావేశాలు జరుగుతున్న సమయంలో మోటారు వాహనాల చట్టంపై స్వల్పకాలిక చర్చ సాగుతున్న సమయంలో, కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ ప్రసంగిస్తూ, తమ పార్టీకి గోవాలో విలన్ గడ్కరీయేనని అన్నారు.

దీంతో కల్పించుకున్న గడ్కరీ, "మీ హీరో రాత్రి పూట నిద్రపోతే నన్నెందుకు అంటున్నారు. ఆయన రాత్రి పూట నిద్రపోకుండా ఉంటే, మీ సినిమా నడిచేది" అని దెప్పి పొడిచారు. కాగా, 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ 17, బీజేపీ 13 స్థానాల్లో గెలిచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News