: జియో ఆఫర్ ను ఎందుకు ఆపాల్సి వచ్చిందంటే..: ట్రాయ్ వివరణ ఇది


రిలయన్స్ జియో తన కస్టమర్ల ముందుకు తెచ్చిన సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ నిబంధనలకు అనుగుణంగా లేదని, దీనిపై జియో ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేనందునే ఆఫర్ ను ఆపివేయాలని ఆదేశించామని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు. ఈ పథకం గురించిన పూర్తి సమాచారాన్ని తెలియజేయాలని ఈ నెల 1వ తేదీనే కోరామని, వారితో చర్చించిన తరువాత, తాము సంతృప్తి చెందలేదని తెలిపారు.

ఈ ఆఫర్ కింద ప్రస్తుత టారిఫ్ పథకాలకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామని జియో వెల్లడించిందని, అయితే, టెలికం నిబంధనలకు ఇది అనుగుణంగా లేదని తెలిపారు. అయినప్పటికీ, ముందుగా రుసుములు చెల్లించిన వారికి మాత్రం జూన్ చివరి వరకూ ఆఫర్ లో భాగంగా సంస్థ తెలిపిన రాయితీలు వర్తిస్తాయని ట్రాయ్ సెక్రెటరీ సుధీర్ గుప్తా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News