: క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరచిపోయే అవమానం కాదిది: పవన్ కల్యాణ్


దక్షిణాది వారు నల్లగా ఉన్నా వారితో కలిసే ఉంటున్నామని బీజేపీ నేత విజయ్ తరుణ్ చేసిన వివక్షా పూరిత వ్యాఖ్యలపై నిన్న తన ట్విట్టర్ ఖాతాలో విరుచుకుపడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరిన్ని ట్వీట్లు పెట్టారు. ఆపై విమర్శలు రాగా విజయ్ తరుణ్ క్షమాపణలు చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ, "క్షమాపణలు చెప్పినంత మాత్రాన మరచిపోయే అవమానం కాదిది" అంటూ తనలోని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "ఇలాంటి వివక్షలు జాతిని గీతలు గీసి మరీ విడదీస్తాయి" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, వాళ్లకు చోటు ఇచ్చే పార్టీలు జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యమని అన్నారు.

  • Loading...

More Telugu News