: విజయ్ మాల్యా విల్లాను సొంతం చేసుకున్న టాలీవుడ్ హీరో!


లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు చెందిన ఓ విలాసవంతమైన విల్లా ఎట్టకేలకు అమ్ముడుబోయింది. ఈ విల్లాను టాలీవుడ్ హీరో, వ్యాపారవేత్త సచిన్ జోషి కొనుగోలు చేశాడు. ఈ విల్లా గోవాలో ఉంది. బ్యాంకులకు భారీ మొత్తంలో అప్పులు ఎగ్గొట్టి, విదేశాలకు వెళ్లిపోయిన మాల్యా ఆస్తులను వేలం వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విల్లాను అమ్మడానికి పలు మార్లు వేలం నిర్వహించారు. అయినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు.

ఈ నేపథ్యంలో సంప్రదింపుల ద్వారా బేరం మాట్లాడుకున్న సచిన్ జోషి, చివరకు విల్లాను సొంతం చేసుకున్నాడు. చివరిసారి వేలంలో నిర్ణయించిన రిజర్వ్ ధర రూ. 73 కోట్ల కంటే ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సచిన్ అంగీకరించాడు. సచిన్ జోషి విల్లాను సొంతం చేసుకున్నట్టు ఎస్బీఐ ఛైర్ పర్సన్ అరుంధతి భట్టాచార్య ధ్రువీకరించారు. ఈ విల్లాలో అన్ని రకాల సదుపాయాలు, వసతులు ఉన్నాయి.

తెలుగులో 'మౌనమేలనోయి', 'నిన్ను చూడలేక నేనుండలేను', 'ఒరేయ్ పండు', 'నీ జతగా నేనుండాలి', 'మొగలిపువ్వు' తదితర సినిమాల్లో నటించాడు. హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించాడు. అంతేకాదు, జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కు వైస్ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ గ్రూప్ పలు వ్యాపారాలను నిర్వహిస్తోంది. 

  • Loading...

More Telugu News