: సిరియాపై మరిన్ని దాడులుంటాయన్న అమెరికా... తీవ్ర చర్యలు తప్పవన్న రష్యా!


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను లక్ష్యం చేసుకుంటూ మరిన్ని దాడులు చేస్తామని, సిరియాలో అధ్యక్షుడి సొంత సైన్యం ఆగడాలను కొనసాగనివ్వబోమని, ఆ దేశంలోని ఎయిర్ బేస్ లను పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. ఈ మేరకు నిన్న తాము జరిపిన తొమహాక్ క్షిపణి దాడులను సమర్థించుకుంటూ వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. బాధ్యతగల దేశంగా అమాయక పౌరులు, చిన్నారులను హత్యలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. ఇక అమెరికా తాజా వ్యాఖ్యలపై రష్యా స్పందిస్తూ, మరోసారి ఇదే తరహా దాడులకు పాల్పడితే, తీవ్ర చర్యలకు దిగుతామని హెచ్చరించింది. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అణచివేతే లక్ష్యంగా ప్రభుత్వ సైన్యం పని చేస్తోందని కితాబిచ్చింది.

  • Loading...

More Telugu News