: సైబరాబాద్ పరిధిలో 11న మద్యం దుకాణాలు బంద్.. సీపీ సందీప్ శాండిల్య
హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధిలో ఈనెల 11న మద్యం దుకాణాలను బంద్ చేస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆరోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. సైబరాబాద్ పరిధిలోని కల్లు దుకాణాలు, మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే స్టార్ హోటళ్లలోని బార్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లకు మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.