: అమెరికాలో మరో ఘోరం.. భారతీయుడి కాల్చివేత!
అమెరికాలో మరో భారతీయుడు కాల్పులకు బలయ్యాడు. పంజాబ్‌కు చెందిన విక్రమ్ జర్యాల్ (26) యకిమా నగరంలో హత్యకు గురయ్యాడు. యువకుడు పనిచేస్తున్న ఏఎం-పీఎం గ్యాస్ స్టేషన్‌కు తుపాకులతో వచ్చిన దుండుగులు డబ్బు డిమాండ్ చేశారు. కౌంటర్‌లో ఉన్న సొమ్మును తీసుకొచ్చి ఇచ్చాక ఆ డబ్బును తీసుకున్న దుండగులు విక్రమ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు.
తీవ్ర గాయాలపాలైన విక్రమ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందాడు. ఇది జాత్యహంకార దాడేనని అమెరికాలోని భారతీయులు ఆరోపిస్తున్నారు. విక్రమ్ హత్య విషయాన్ని ఆయన సోదరుడు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ దృష్టికి తీసుకొచ్చారు. స్వగ్రామమైన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు తీసుకురావడంలో సహకరించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. విక్రమ్ హత్యను ఖండించిన సుష్మ మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు అన్ని విధాలా సాయం అందిస్తామని తెలిపారు.