: ఆ విషయం వరుణ్ తేజ్ కు ఎప్పుడూ చెబుతుంటాను: మెగాస్టార్ చిరంజీవి


వరుణ్ తేజ్ వెనుక తాము ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ చెబుతుంటానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మిస్టర్ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి మాట్లాడుతూ, ‘వరుణ్ తేజ్ కు నేను ఎప్పుడూ చెబుతుంటాను. నీ వెనుక మేము ఉన్నాను.. అభిమానులు ఉన్నారు అని. కష్టపడితే విజయం సాధిస్తామని చెబుతుంటాను. వరుణ్  మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చేసిన చిత్రాల ద్వారా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. శ్రీను వైట్ల గురించి చెప్పాలంటే.. అతను అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే, కామెడీ అంటే నాకు ఇష్టం కనుక. 'అందరివాడు' చిత్రం తర్వాత ఆయన దర్శకత్వంలో మరో చిత్రం చేయడం కుదర్లేదు... మిస్టర్ చిత్రం ద్వారా శ్రీను వైట్ల తన సత్తా చాటుకుంటాడనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆల్ ది బెస్ట్.. శ్రీను..’ అని మెగాస్టార్ అన్నారు.

  • Loading...

More Telugu News