: ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి ‘ఖైదీ’: దర్శకుడు శ్రీను వైట్ల


చిరంజీవి పేరు వినగానే తనకు గుర్తుకు వచ్చేది ‘ఖైదీ’ అని, ఆ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. మిస్టర్ చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవి ‘ఖైదీ’ అని, ఇటీవల విడుదలైన ఆయన చిత్రం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో తెలిసిన విషయమేనని అన్నారు. త్వరలో విడుదల కానున్న మిస్టర్ చిత్రం గురించి తాను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదని అన్నారు. వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ, తనకు చాలా ఇష్టమైన నటుడుని, సహజంగా నటిస్తాడని శ్రీను వైట్ల ప్రశంసించారు.

  • Loading...

More Telugu News