: అద్భుతమైన ఫీట్స్ చేసిన ట్రెంట్ బోల్ట్, దినేష్ కార్తీక్
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అద్భుతమైన ఫీట్ తో క్రికెట్ అభిమానులను అలరించాడు. సాధారణంగా బౌలర్లు ఫీల్డింగ్ చేసేందుకు వేగంగా స్పందించరన్న అపప్రధను బౌల్ట్ పోగొట్టాడు. పియూష్ చావ్లా వేసిన 14వ ఓవర్ రెండో బంతిని గుజరాత్ కెప్టెన్ సురేష్ రైనా భారీ షాట్ గా మలచే ప్రయత్నం చేశాడు. దీనిని మిడ్ వికెట్ లో ఫీల్డింగ్ చేస్తున్న ట్రెంట్ బౌల్ట్ ఎడమవైపుకు పరుగెడుతూ అద్భుతంగా బంతిని క్యాచ్ పట్టాడు. ఇంతలో బౌండరీ లైన్ అవతలపడిపోవడం గుర్తించి, బంతిని బౌండరీ లైన్ లోపలికి విసిరేశాడు. దీంతో రైనా అవుట్ కానప్పటికీ 4 పరుగులు వెళ్లకుండా చేయగలిగాడు. ఈ సందర్భంగా బౌల్ట్ ఫీట్ అందర్నీ ఆకట్టుకుంది.
అనంతరం 16వ ఓవర్ నాల్గవ బంతికి సురేష్ రైనా షాట్ కొట్టాడు. అది డీప్ మిడ్ వికెట్ లాంగ్ ఆన్ మధ్యలో పడింది. దీనిని బౌల్ట్ వేగంగా త్రో చేశాడు. ఇంతలో రెండో రన్ కోసం దినేష్ కార్తిక్ పరుగెత్తుకొచ్చాడు. రైనా వేగంగా స్పందించకపోవడంతో అక్కడ బ్రేక్ వేసినట్టు ఆగాడు. దినేష్ ఆగడని భావించిన రైనా పరుగందుకున్నాడు. ఇద్దరూ సగం పిచ్ లో ఉన్నారు. దీంతో దినేష్ కార్తీక్ వేగంగా రెండు అడుగులు వేసి అద్భుతంగా డైవ్ చేసి క్రీజులోకి చేరుకున్నాడు. బంతిని అందుకున్న కుల్ దీప్ యాదవ్ దానిని కీపర్ ఊతప్పకు అందించి ఉంటే రైనా అవుటై ఉండేవాడు. అలా చేయకపోవడంతో రైనా మూడోసారి బతికిపోయాడు. దీంతో రైనా (53), దినేష్ కార్తీక్ (23) 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.