: 'మా అన్న చాలా అందంగా ఉన్నాడ'న్న నీహారిక
'మా అన్న వరుణ్ తేజ్ చాలా అందంగా ఉన్నాడు కదా!' అంటూ నటి, వరుణ్ తేజ్ సోదరి నీహారిక కితాబు ఇచ్చింది. ‘మిస్టర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన నీహారిక మాట్లాడుతూ, ఇప్పటివరకు తన అన్నయ్య నటించిన చిత్రాల్లో ఈ చిత్రం లుక్ అద్భుతంగా ఉందని, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని చెప్పింది. అంతకుముందు, ‘మిస్టర్’ చిత్రంలోని ఓ పాటను నీహారిక లాంచ్ చేసింది.