: చిరంజీవికి గ్రీటింగ్స్ చెప్పిన లావణ్య... అందర్నీ నవ్వించిన హెబ్బా పటేల్!


మెగాస్టార్ చిరంజీవికి ‘మిస్టర్’ హీరోయిన్ లావణ్య  త్రిపాఠి శుభాకాంక్షలు చెప్పింది. ఎందుకంటే, చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’వ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయినందుకు తన శుభాకాంక్షలు చెబుతున్నానని ‘మిస్టర్’ ప్రీ-రిలీజ్ వేడుకకు హాజరైన లావణ్య త్రిపాఠి పేర్కొంది. ఇక, హీరో వరుణ్ తేజ్ గురించి మాట్లాడుతూ, అతనితో నటించడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ అని, వరుణ్ మంచి నటుడంటూ చెప్పుకొచ్చింది. అనంతరం, మిస్టర్ చిత్రంలోని మరో హీరోయిన్ హెబ్బా పటేల్ మాట్లాడింది. మొదట ఇంగ్లీషులో మాట్లాడిన హెబ్బా, ఆ తర్వాత తనకు వచ్చిన తెలుగులో కొంచెం సేపు మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా, కడుపుబ్బ నవ్వుకునేలా చేసింది. 

  • Loading...

More Telugu News