: స్వీడన్ లో షాపింగ్ కాంప్లెక్స్ లోకి దూసుకుపోయిన వ్యాన్.. ముగ్గురి మృతి!
స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ లోని ఓ డిపార్టుమెంటల్ స్టోర్ లోకి ఓ వ్యాన్ దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. స్వీడన్ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన వీధుల్లో ఒకటైన డ్రాటినింగాటన్ (క్వీన్ స్ట్రీట్)లో ఈ సంఘటన చోటు చేసుకుందని చెప్పారు. షాపింగ్ సెంటర్ బయట ఉన్న వ్యక్తులను ఢీకొట్టుకుంటూ వ్యాన్ దూసుకు పోయిందని చెప్పారు. సాయుధ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లినట్లు తెలిపారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారని తెలిపారు. ప్రత్యక్షసాక్షుల కథనం ప్రకారం, డిపార్టుమెంటల్ స్టోర్ కిటికీని ఢీ కొట్టుకుంటూ ఓ ట్రక్కు దూసుకుపోయిందని చెప్పారు. తుపాకీ కాల్పులు వినిపించాయని పేర్కొన్నారు.