: నాన్నా.. మీ ఆశీర్వాదం వల్లే ఇదంతా జరిగింది: జాతీయ అవార్డు రావడం పట్ల ‘పెళ్లి చూపులు’ దర్శకుడు
ఈ రోజు ప్రకటించిన 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లి చూపులు’కి అవార్డు లభించిన విషయం తెలిసిందే. అంతేగాక, ఇదే చిత్రానికి దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు ఉత్తమ మాటల రచయితగా కూడా అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా ద్వారా హర్షం వ్యక్తం చేశాడు. ‘థ్యాంక్యూ... మా నాన్న ఎంతగానో సంతోషం వ్యక్తం చేసే సందర్భం ఇది... అంతా మీ ఆశీర్వాదం వల్లే జరిగింది నాన్న’ అని ఆయన ఫేస్‌బుక్‌లో ఆనందం వ్యక్తం చేశాడు.
చిన్న సినిమాగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన పెళ్లి చూపులు సినిమా పెద్ద విజయమే సాధించిన విషయం తెలిసిందే. సినిమాలో పండించిన హాస్యం, స్త్రీ సాధికారత, మంచి కథ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా దర్శకుడితో పాటు చిత్రంలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చింది.