: జమ్మలమడుగు టీడీపీ సమావేశంలో రసాభాస.. ఎంపీ సీఎం రమేష్‌పై కుర్చీలు విసిరిన రామసుబ్బారెడ్డి అనుచరులు
కడప జిల్లా జమ్మలమడుగులో ఈ రోజు నిర్వహించిన టీడీపీ సమావేశం రసాభాసగా మారింది. కొద్దిసేపటి క్రితం సమావేశానికి హాజరైన ఎంపీ సీఎం రమేష్‌పై రామసుబ్బా రెడ్డి అనుచరులు కుర్చీలు విసరడంతో అలజడి రేగింది. సీఎం రమేష్ గో బ్యాక్ అంటూ రామసుబ్బారెడ్డి అనుచరులు నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన మరింతగా చెలరేగకుండా పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.