: ఆర్కే నగర్ లో శశికళకు మద్దతుగా విజయశాంతి ప్రచారం
తమిళనాడులో ఆర్కేనగర్ ఉపఎన్నికల ప్రచార వేడి రాజుకుంటోంది. ఈ ఉపఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీలు పాచికలు వేస్తున్నాయి. పన్నీరు సెల్వం వర్గం జయలలిత శవపేటికను పోలిన డమ్మీతో ప్రచారంలో పాల్గొంటుండగా, శశికళ వర్గం నేత టీవీవీ దినకరన్ మాత్రం సినీ నటులను తన ప్రచారానికి రప్పించుకుంటూ గెలిచేందుకు ఎత్తులు వేస్తున్నారు. నిన్న శరత్ కుమార్ ను తన ఎన్నికల ప్రచారానికి రప్పించుకున్న దినకరన్, నేడు ప్రముఖ సీనియర్ నటి విజయశాంతితో ప్రచారం చేయించారు. దినకరన్ ను గెలిపించాలని విజయశాంతి ఆర్కేనగర్ ఓటర్లను కోరారు.