: నిజమా? మరి నీకోసం 12 కోట్లు ఖర్చు చేయొచ్చా?: గంభీర్ కు సెహ్వాగ్ కౌంటర్
ఒకప్పటి టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ మధ్య మాటల తూటాలు పేలాయి. గంభీర్ ఎవరూ ఊహించని వ్యాఖ్య చేస్తే... దానికి దీటైన కౌంటర్ ఇచ్చాడు సెహ్వాగ్. వీరిద్దరి మధ్య ఈ ఘటనకు కారణం ఇషాంత్ శర్మ... ఐపీఎల్ బిడ్డింగ్ లో తన ప్రాధమిక ధర అంటూ ఇషాంత్ శర్మ 2 కోట్ల రూపాయలను పేర్కొన్నాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన గంభీర్... మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసే బౌలర్ ను కొనేందుకు ఏ జట్టూ అంత మొత్తం భరించదని అన్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ వేలంలో ఇషాంత్ అమ్ముడుపోలేదు. అనంతరం సెహ్వాగ్ సూచనతో జీఎమ్మార్ యాజమాన్యం ఇంషాంత్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ లోకి తీసుకుంది. ఈ సందర్భంగా మీడియా ఆ జట్టు కోచ్ సెహ్వాగ్ ను గంభీర్ వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా... 'కనీసం 60 బంతులైనా ఆడని గంభీర్ కు 12 కోట్లు ఇవ్వడం లేదా?' అని సెహ్వాగ్ ఎద్దేవా చేశాడు.