: 'సీత' షార్ట్ ఫిలిం దర్శకుడిని కొట్టండి.. నగదు బహుమతి పట్టుకెళ్లండి: హిందూ ఆత్మరక్షణ సమితి
సీత అనే షార్ట్ ఫిలింకి ‘ఐయామ్ నాట్ వర్జిన్’ అంటూ ఉప శీర్షిక పెట్టిన దర్శకుడు కౌశిక్ బాబు హిందూ సంఘాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఇప్పటికే ఆయనపై ఎంతో మంది మండిపడ్డారు. దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతున్న వేళ హిందూ ఆత్మరక్షణ సమితి కార్యదర్శి మేకల శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు మాట్లాడుతూ.. ఈ చిత్ర దర్శకుడు కౌశిక్ బాబు వీపు పగలగొట్టిన వారికి 50 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ఇక కౌశిక్‌ను ఏకంగా రాముడు సన్నిధికే పంపిస్తే రూ.లక్ష ఇస్తామని చెప్పారు.
‘సీత.. ఐయామ్ నాట్ వర్జిన్’ అంటూ పేరు పెట్టిన కౌశిక్.. చెత్త పబ్లిసిటీ కోసమే ఆరాటపడుతున్నాడని ఇటీవలే కొందరు విమర్శించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కౌశిక్ మాత్రం తనకు సీతమ్మ వారిపై, ఆడవారిపై గౌరవం ఉందని, షార్ట్ ఫిలిం చూసిన తరువాత దీనిపై మాట్లాడాలని వ్యాఖ్యానించాడు.