: ఇజ్రాయిల్ చరిత్రలోనే భారీ ఒప్పందం... భారత్‌కు క్షిపణుల సరఫరా!
ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన నేవీ, ఆర్మీ క్షిపణులను భారత్‌కి సరఫరా చేయడానికి తాము ఒప్పందం చేసుకొన్నట్లు ఐఏఐ (ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్) తెలిపింది. మొత్తం 2 బిలియన్ డాలర్ల విలువైన ఈ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంతటి భారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇజ్రాయిల్ చరిత్రలోనే మొదటిసారి. ఈ ఒప్పందంలో ఐఏఐ వాటా 1.6 బిలియన్ డాలర్లు. మిగతా మొత్తం మరో దేశానికి చెందిన రాఫెల్ కంపెనీకు దక్కింది. ఈ ఒప్పందంలో భాగంగా బరాక్ 8 (మీడియం రేంజ్ క్షిపణి), లాంగ్ రేంజ్ క్షిపణులను ఆ దేశం సరఫరా చేస్తుంది. ఈ క్షిపణులు 50 నుంచి 70 కి.మీ.ల వరకు డ్రోన్లను, వైమానిక దాడులను ఎదుర్కుని తిప్పికొట్టగలదు.