: నాటికి, నేటికీ నా ముందు చంద్రబాబు జీరోనే!: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి
నాటికి, నేటికీ చంద్రబాబునాయుడు తన ముందు జీరోయే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనను రాజకీయంగా సాధించేందుకే ఫిరాయింపు ఎమ్మెల్యే అమర్ నాథ్ రెడ్డికి మంత్రి పదవిని ఇచ్చారని విమర్శించారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో తాను డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నానని, తమ జిల్లా నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నానని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని తప్పుబట్టిన ఆయన, గవర్నర్ తీరునూ విమర్శించారు.