: హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఈ రోజు మధ్యాహ్నం వర్షం కురిసింది. ఎంజీబీఎస్, నాంపల్లి, కోఠి, ఆబిడ్స్, బాగ్ లింగంపల్లి, ఖైరతాబాద్, ఇందిరాపార్కు, ఎంజే మార్కెట్, మలక్ పేట, కొత్తపేట, సరూర్ నగర్, చంపాపేట, ట్రూప్ బజార్, గన్ ఫౌండ్రీ, ఎల్బీనగర్, నాగోల్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో, మండుతున్న ఎండల బారి నుంచి కొంచెం ఉపశమనం లభించినట్టయింది.